schedule Thursday, September 03, 2026

సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్

calendar_today August 23, 2026
person dharshininews
సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్
సోదరభావానికి ప్రతీక రక్షాబంధన్ - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మల్‌రెడ్డిపల్లిలో గల రాజయోగ కేంద్రంలో బ్రహ్మకుమారీ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రక్షాబంధన్ ప్రేమ, ఆప్యాయత, సోదరభావానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. బ్రహ్మకుమారీ సమాజం ఆధ్యాత్మికతతో పాటు మానవతా విలువలను పెంపొందించేందుకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మానవతా విలువలు మరింత బలోపేతమై, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బ్రహ్మకుమారీ సోదరీమణులు, సమాజం ప్రతినిధులు, పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44337/