schedule Thursday, September 03, 2026

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

calendar_today August 20, 2026
person dharshininews
రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి
రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి - తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు - పాల్గొన్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని రాజీవ్‌ కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో రాజీవ్‌గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు సాంకేతిక రంగానికి పెద్దపీట వేసిన ఆయన దార్శనికత దేశ ప్రగతికి పునాది వేసిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పటికీ స్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. రాజీవ్‌ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, తాండూరు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44278/