schedule Thursday, September 03, 2026

క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!

calendar_today August 7, 2026
person dharshininews
క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!
క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..! - నాసిరకంగా నిర్మాణ పనులు - దృష్టిసారించని వార్డు కౌన్సిలర్ - 10వ వార్డులో ఇష్టారాజ్యంగా పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : క్వాలీటి ప్రమాణాలతో చేపట్టాల్సిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు డొల్లతనంగా మారుతున్నాయి. కాలనీ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాండూరు పట్టణం 10వ వార్డులో ప్రభుత్వ నెంబర్‌ వన్‌ పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి వార్డు కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్‌లతో కలిసి ప్రారంభించారు. ప్రారంభం రోజు నుంచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సీసీ రోడ్డు పనులను నాణ్యత రహితంగా చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఇసుక, కంకర మిశ్రమాలను నాణ్యత ప్రమాణాలకు విరుద్దంగా చేపడుతున్నట్లు, ఇసుక, సిమెంట్ సక్రమంగా వేయడం లేదని వాపోతున్నారు. భవాని నగర్‌లో వర్షాలు పడితే ముందు నీట మునిగే ప్రాంతం ఇదే అని, నాణ్యత లేకుండా పనులు చేపడితే మూన్నాళ్లకే రోడ్డు పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభంలో దృష్టి సారించిన వార్డు కౌన్సిలర్ పనులను క్వాలిటీతో పూర్తి చేయిండంలో చిత్త శుద్ది చూపించడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సీసీ రోడ్డు పనులను నాణ్యతంగా పూర్తిచేయించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. https://www.dharshininews.com/44092/