schedule Friday, September 04, 2026

కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్‌తో బీఎస్‌ఆర్‌ భేటి

calendar_today August 5, 2026
person dharshininews
కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్‌తో బీఎస్‌ఆర్‌ భేటి
కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్‌తో బీఎస్‌ఆర్‌ భేటి - ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్‌ సురేష్‌ను తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్‌ఆర్‌) భేటి అయ్యారు. బుధవారం ఢిల్లీలో కొడికున్నిల్ సురేష్‌ను శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే దేశ, రాష్ట్రాల్లో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం కొడికున్నిల్ సురేష్‌కు శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. https://www.dharshininews.com/44049/