schedule Friday, September 04, 2026

ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..!

calendar_today August 5, 2026
person dharshininews
ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..!
ఎమ్మెల్యే బర్త్‌డే.. సేవా స్ఫూర్తి..! - ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ బహూకరణ - జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ - పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే జన్మదిన రోజు సేవాస్పూర్తి నెలకొంది. కేక్ కటింగ్‌లు, సంబరాలకు భిన్నంగా సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదిన వేడుకలు బుధవారం తాండూరులో నిర్వహించారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థ రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక అంబులెన్స్‌ను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి అందజేసింది. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, యునైటెడ్ వే బెంగళూరు సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అంబులెన్స్‌ను ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, యునైటెడ్ వే బెంగళూరు సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44031/