schedule Thursday, September 03, 2026

ప్రజా సేవకుడు మనోహరన్న..!

calendar_today August 3, 2026
person dharshininews
ప్రజా సేవకుడు మనోహరన్న..!
ప్రజా సేవకుడు మనోహరన్న..! - చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి - ఆసుపత్రుల్లో కొనసాగుతున్న అల్పాహార సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రజల మనసుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజా సేవకుడిగా నిలుస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ ఆసుపత్రుల్లో శ్రీకారం చుట్టిన రోగులకు అల్పాహార సేవా కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం జిల్లా ఆసుపత్రిలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిలు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకు రోగులకు అల్పాహారం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నిరంతరం తాండూరు అభివృద్ది, ప్రజల కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రజా నాయకుడుగా నిలుస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో అల్పాహార పంపిణీ 5వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44014/