schedule Thursday, September 03, 2026

ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..!

calendar_today July 31, 2026
person dharshininews
ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..!
ఘనంగా పివిఆర్ జన్మదిన వేడుకలు..! - ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షల వెల్లువ - విద్యాలయాల్లో మొక్కలు నాటిన విద్యార్థులు, అధ్యాపకులు - దైవ దర్శనంలో ప్రత్యేక పూజలు చేసిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతోపాటు చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పివిఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. స్వగ్రామమైన ఖాoజాపూర్ తో పాటు నియోజకవర్గంలోని అభిమానులు ప్రత్యక్షంగా పరోక్షంగా, శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఏడుపాయలు, కొమరవెల్లి, వేములవాడ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై అభిమానంతో ప్రత్యక్షంగా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గం ప్రజల ఆదరభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. ప్రస్తుతం చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో పివిఆర్ ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేయనున్నట్లు వెల్లడించారు. యువత రాజకీయ నేతల మాటలకు మోసపోకుండా చక్కటి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. త్వరలో యువతను చైతన్యపరిచే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. https://www.dharshininews.com/43982/