schedule Thursday, September 03, 2026

దత్తాత్రేయ సేవలో విఠల్ నాయక్

calendar_today July 29, 2026
person dharshininews
దత్తాత్రేయ సేవలో విఠల్ నాయక్
దత్తాత్రేయ సేవలో విఠల్ నాయక్ - గాన్గాపూర్‌లో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం గాన్గాపూర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు వినాయక గ్రూప్స్ చైర్మన్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వర్త్యా విఠల్‌ నాయక్ తరించారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి పౌర్ణమి మాదిరిగానే దేవాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమిరోజు చేసిన పూజలు, దానధర్మాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు రాజు, భక్తులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43970/