schedule Thursday, September 03, 2026

బిల్ వన్ వెరీ బెటర్..!

calendar_today July 29, 2026
person dharshininews
బిల్ వన్ వెరీ బెటర్..!
బిల్ వన్ వెరీ బెటర్..! - ఒకే యాప్ లో మూడు రకాల బిల్లుల చెల్లింపు - క్రెడిట్, డెబిట్ కార్డులతో కట్టే అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేర్వేరుగా చెల్లిస్తున్న ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఇకపై ఒకే బిల్లులో వసూలు చేసేలా 'బిల్ వన్' విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా పన్నుల చెల్లింపు ప్రక్రియ సరళీకృతం కావడంతో పాటు, ప్రజలు ఒకే లావాదేవీ ద్వారా అన్ని చెల్లింపులు పూర్తి చేసే అవకాశం లభించనుంది. దీంతో సమయం ఆదా కావడంతో పాటు మున్సిపల్ సేవల్లో పారదర్శకత కూడా పెరగనుంది. ఇంటింటికీ సేవలు మున్సిపల్ సిబ్బంది హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లతో ఇంటింటికీ వెళ్లి ఒకే బిల్లును రూపొందించి పన్నులు వసూలు చేయనున్నారు. నగదు, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయోజనాలు ఒకే బిల్లుతో మూడు రకాల పన్నుల చెల్లింపు. పన్ను చెల్లింపులో సులభతరం, పారదర్శకత. ఇంటి వద్దనే బిల్లు రూపొందించి వసూళ్లు. డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం. మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మెరుగైన సామర్థ్యం   https://www.dharshininews.com/43958/