schedule Friday, September 04, 2026

చిలుకవాగుకు మహర్థశ..!

calendar_today July 27, 2026
person dharshininews
చిలుకవాగుకు మహర్థశ..!
చిలుకవాగుకు మహర్థశ..! - రూ. 30 కోట్ల నిధులపై అధికారిక జీఓ - సీఎం, డీప్యూటీ సీఎంలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు - మనోహర్ రెడ్డికి కృషికి తాండూరు నేతల జేజేలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చిలుక వాగు ప్రాజెక్టుకు మహర్థశ పట్టింది. గతంలో రూ. 16 కోట్లతో చేపట్టిన చిలుక వాగు డ్రైనేజీ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ పనులు సంపూర్ణంగా చేపట్టేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం చిలుక వాగుకోసం రూ. 30 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు అందించారు. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు నిధులు మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సోమవారం చిలుక వాగుకు రూ. 30 కోట్ల నిధుల మంజూరుపై ప్రభుత్వం అధికారిక జీవోను విడుదల చేసింది. ఈ జీవోపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తాండూరు అభివృద్ధిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న కృషిపై స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిలుక వాగు ప్రాజెక్టును సంపూర్ణం చేసేందుకు సాగిస్తున్న కృషికి జేజేలు పలుకుతున్నారు. https://www.dharshininews.com/43927/