schedule Thursday, September 03, 2026

పట్నం రుక్కమ్మకు శ్రద్దాంజలి

calendar_today July 25, 2026
person dharshininews
పట్నం రుక్కమ్మకు శ్రద్దాంజలి
పట్నం రుక్కమ్మకు శ్రద్దాంజలి - చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డికి పరామర్శల వెల్లువ - మహేందర్ రెడ్డి తల్లికి పలువురు నివాళులు - సానుభూతి తెలిపిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - తాండూరు నుంచి తరలివెళ్లిన నేతలు, పట్నం అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్‌ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మకు పలువురు శ్రద్దాంజలి ఘటించారు. అనారోగ్యానికి గురైన మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు నేతలు, ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్‌ తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని మహేందర్ రెడ్డి నివాసంలో రుక్కమ్మ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్‌లు పట్లోళ్ల బాల్ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్‌, పలువురు ప్రముఖులు, పలు పార్టీల నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, నర్మదా రెడ్డిలను పరామర్శించారు. పట్నం అవినాష్‌ రెడ్డి, పట్నం రీనిష్ రెడ్డి, కుటుంబీకులను ఓదార్చారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజప్ప గౌడ్, వీరందర్ రెడ్డి, గడ్డలి రవీందర్, మాజీ ఫ్లోర్‌ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ సురేష్ నాయక్ తదితరులు కూడా నివాళులు అర్పించారు. శనివారం మహేందర్ రెడ్డి స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగౌడలో రుక్కమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో తాండూరుకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. https://www.dharshininews.com/43900/