schedule Thursday, September 03, 2026

ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..!

calendar_today July 22, 2026
person dharshininews
ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..!
ఎమ్మెల్యేపై వాఖ్యలను వక్రీకరిస్తే ఖబడ్దార్..! - సీఎం మాటలపై దుష్ప్రచారం మానుకోండి - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేసిన వాఖ్యలను వక్రీకరించాలని చూస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు బీఆర్ఎస్ విమర్శకులకు హెచ్చరించారు. బుధవారం కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేపై చేసిన సరదా వాఖ్యలను కొందరు నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిజానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, దానిని ఉద్దేశించి సరదాగా చేసిన వాఖ్యలే అని చెప్పుకొచ్చారు. దానికి కొందరు నేతలు ఎమ్మెల్యేను విమర్శించినట్లు, దూషించినట్లు, హేళన చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్‌ రెడ్డిపై ఉన్న ఆదరణను ఓర్వలేక మొరిగే కుక్కల మాదిరిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొందరి నేతల్లాగా గంజాయి, డ్రగ్స్, అక్రమ దందాలు ఎమ్మెల్యే చేయలేదని, నీతిగా, నిజాయితీ పాలన చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని, లేదంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. https://www.dharshininews.com/43870/