కొంపముంచిన నిద్రమత్తు..!
July 22, 2026
dharshininews
కొంపముంచిన నిద్రమత్తు..!
- డివైడర్‌ను ఢీ కొట్టిన డీసీఎం
- స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్
- తాండూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తు ఓ పెద్ద రోడ్డు ప్రమాదానికి గురిచేసింది. వేగంగా వెళుతున్న డీసీఎం ఫ్లైఓవర్ బ్రిడ్జి డివైడర్‌ను ఢీ కొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్ణాటక సేడం వైపు ఓ డీసీఎం వెళుతోంది. బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తాండూరుకు చేరుకుంది. డ్రైవర్ జితేందర్ అప్పటికే నిద్రమత్తులో ఉన్నాడు.
వేగంగా వెళుతుండగా బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద డీసీఎం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ జితేందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీసీఎంను అక్కడి నుంచి తరలించారు.
https://www.dharshininews.com/43862/