schedule Thursday, September 03, 2026

ఆశ్రమంలో అక్రమం..!

calendar_today July 17, 2026
person dharshininews
ఆశ్రమంలో అక్రమం..!
ఆశ్రమంలో అక్రమం..! - స్వామీజీ ముసుగులో గంజాయి సాగు - గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు - యాలాల మండలంలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధ్యాత్మికతను పంచాల్సిన ఆశ్రమం అక్రమానికి వేధికైంది. ఆశ్రమం చుట్టూ గంజాయి సాగు చేస్తున్న స్వామీజీ గుట్టు రట్టయ్యింది. టాస్క్ ఫోర్స్‌, పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం గోవిందరావుపేట శివారులో ఓ స్వామీజీ, మాతాజీతో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆశ్రమంలో అక్రమ సాగు జరుగుతోందని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం వికారాబాద్‌ జిల్లా టాస్క్ ఫోర్స్‌ సీఐ అన్వర్ పాష, తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, ఎక్సైజ్ పోలీసుల బృందాలతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అశ్రమం వద్ద గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆశ్రమం ముందు పెంచుతున్న సుమారు 25 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమం వద్దనే రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పంచనామాను పూర్తి చేశారు. ఈ మేరకు ఆశ్రమంకు చెందిన స్వామీజీపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. https://www.dharshininews.com/43803/