schedule Friday, September 04, 2026

ఏటీసీలో మరో ఛాన్స్..!

calendar_today July 1, 2026
person dharshininews
ఏటీసీలో మరో ఛాన్స్..!
ఏటీసీలో మరో ఛాన్స్..! - ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడగింపు - ఎక్కడ.. ఎలా చేసుకోవాలంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లో 2026-27 విద్యాసంవత్సరానికి మొదటి విడత అడ్మిషన్లకు దరఖాస్తుల గడువును పొడగించినట్లు ప్రిన్సిపల్ యం. విజయ కుమారి తెలిపారు. జూన్ 30 వరకు ఉన్న గడువును ఈ నెల 10వ తేది వరకు పొడగించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను ఆన్ లైన్ లో ఫోటోతో సహా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉటుందని చెప్పారు. సొంత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ తో రిజిష్టర్ చేసుకొని మీకు నచ్చిన ట్రేడ్ ను ప్రాధాన్యత ఆధారముగా ఎంచు కోవాలని అన్నారు. దరఖాస్తుల కోసం ఆన్లైన్లో https://iti.telangana.gov.in/ ను చూడాలని తెలిపారు. విద్యార్హతలు, వయస్సు, అప్లికేషన్/వెరిఫికేషన్ ఫ్రీ అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తాండూరు ఏటీసీ సెంటర్లో వర్చువల్ విశ్లేషణ అండ్ డిజైనర్- ఎఫ్ఎం(ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్), సీఎస్సీ మెషీనింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, పారిశ్రామిక రోబోటిక్స్ అండ్ డిజిటల్ తయారీ సాంకేతిక నిపుణుడు, తయారీ ప్రక్రియ నియంత్రణ, ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థి, విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ యం. విజయ కుమారి సూచించారు. https://www.dharshininews.com/43654/