schedule Friday, September 04, 2026

వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..!

calendar_today April 12, 2026
person dharshininews
వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..!
వాట్సాప్‌లోనే ఇంటర్‌ రిజల్ట్స్..! - క్షణాల్లోనే ఫలితాల వెల్లడి - ఎలా చూసుకోవాలో తెలుసుకోండి దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని నిమిషాల్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. చాలా మంది కంప్యూటర్ల ముందు, ఇంటర్నెట్‌ సెంటర్ల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే చాలా మంది ఉపయోగించే వాట్సాఫ్‌ ద్వారానే ఇంటర్‌ ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ రిజల్ట్స్ పై వాట్సప్ సేవలను కూడా ప్రారంభించింది. దీంతో వాట్సప్‌లోనే విద్యార్థులు తమ రిజల్ట్స్ పొందవచ్చు. సులువుగా విద్యార్థులు ఫలితాలను పొందేందుకు వాట్సప్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా చూసుకోవచ్చు.. మీ ఫోన్‌లో ముందుగా 8096958096 ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టిన తరువాత ‘BIE Exam Result’ అని టైప్ చేయండి. స్టార్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఎంచుకున్న వెంటనే Telangana BIE Results విండో ఓపెన్ అవుతుంది. అక్కడ చెక్ రిజల్ట్ మీద క్లిక్ చేసి-హాల్ టికెట్ నెంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేయండి. తరువాత గెట్ రిజల్ట్‌పై క్లిక్ చేయండి. మీ రిజల్ట్స్ మీకు వాట్సప్‌లోనే వస్తాయి. ఇదే కాకుండా ప్రభుత్వ వెబ్‌ సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా లేదా  https:// results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. https://www.dharshininews.com/43038/