schedule Saturday, September 05, 2026

మహిళ మెడలో బంగారం చోరీ

calendar_today March 27, 2026
person dharshininews
మహిళ మెడలో బంగారం చోరీ
మహిళ మెడలో బంగారం చోరీ - సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు - రికవరీ చేసి బాధితురాలికి అప్పగింత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ మెడలో నుంచి మరో మహిళ బంగారంను ఎత్తుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితురాలిని గుర్తించి రికవరీ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గౌతపూర్ వెంకటమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈనెల 23న తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సన్న గుండ్లు, నల్లాలతో కూడుకున్న 10 పతులు(7గ్రాములు) దొంగలించారు. దీనిపై బాధితురాలు వెంకటమ్మ తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితురాలిని కనిపెట్టారు. తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌కు చెందిన కుర్వ పద్మగ గుర్తించారు. ఆమెను విచారించి బంగారంను రికవరీ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. https://www.dharshininews.com/42862/