schedule Thursday, September 03, 2026

పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?!

calendar_today December 29, 2025
person dharshininews
పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?!
పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?! - నామినేటేడ్‌ పోస్టులతో పాలకవర్గాలు - పండగలోపు ఏర్పాటు చేసేందుకు కసరత్తు - ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సహాకార సంఘాల(పీఏసీఎస్)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నామినేటేడ్ పోస్టుల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోబోతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సంక్రాంతిలోపు ఏర్పాటు చేసేదిశగా వేగంగా చర్యలు చేపడతోంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో అంశాలపై కూడా అద్యయనం చేస్తోంది. ఎన్నికల ఖర్చులు, గొడవల నివా రణే లక్ష్యంగా పీఏసీఎస్, డీసీసీబీలను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గ్రామీ ణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఎన్నికలు రాజకీయంగా, ఆర్థికంగా భారీ ప్రభా వం చూపడం పరిపాటి. డైరెక్టర్ పదవుల నుంచి చైర్మన్ వరకూ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడం, డబ్బు ఖర్చు, రాజకీయ జోక్యం, ఫిరాయింపులు, గ్రామాల్లో విభేదాలు వంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు బదులుగా నామినేషన్ విధానంలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నియామకాలు ఇలా... ప్రతి పీఏసీఎస్ కు 13 మందితో పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు డైరెక్టర్ పోస్టులు ఇవ్వనున్నారు. ఈ పాలకవర్గాలనుంచే జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్యలు (డీసీఎంఎస్), మార్ఫెడ్, టెస్కాబ్ వంటి సంస్థలకు ప్రతినిధులు ఎంపిక అవవుతారు. అయితే సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే పాలకవర్గాల్లో అవకాశం కల్పిస్తారు. త్వరలో అధికారిక ప్రకటన పీఏసీఎస్లకు ఎన్నికలు లేకుండా నామీ డ్ పాలక మండళ్లు ఏర్పాటు చేసే అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అందుకు సహకార చట్టంలోని నిబందనలు ఏం చెబుతున్నాయన్న అంశాన్ని ప్రభుత్వ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి. సహకార సంఘాలకు పాలకమండళ్లను వీలైనంత త్వరగా పీఏసీఎస్లకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో నామినేటేడ్ పదవులు పొందడం కోసం ఆశావాహులు సిద్దమవతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40257/