భళా.. భవిష్య రెడ్డి..!
December 28, 2025
dharshininews
భళా.. భవిష్య రెడ్డి..!
- బీసీసీఐ ట్రోఫి జట్టుకు ఎంపిక
- రెండోసారి ఘనత సాధించిన తాండూరు అమ్మాయి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన క్రికెటర్ భవిష్య రెడ్డిని పలువురు భళా అంటూ అభినందిస్తున్నారు. వచ్చే నెల 2నుంచి విజయనగరంలో జరిగే బీసీసీఐ మహిళల అండర్ - 15 వన్డే ట్రోఫీకి భవిష్య రెడ్డి ఎంపి కైంది.
బీసీసీఐ ట్రోఫీకి భవిష్య రెడ్డి వరుసగా రెండోసారి ఎంపికైంది. గత యేడాది కూడా బీసీసీఐ ట్రోఫీ జట్టుకు ఎంపికై ప్రతిభను కనబరిచింది. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో భవిష్య రెడ్డి చదువుతోంది. రైతు కుటుంబం అయిన కరుణాకర్ రెడ్డి, మమతా రెడ్డిల కూతురు క్రికెట్ లో రాణిస్తోంది.
తాండూరుకు చెందిన లెజెండ్స్ క్రికెట్ అకాడమి కోచ్ లు ఎండి సాహిల్, ఎండి సోహిల్ లు భవిష్య రెడ్డికి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు భవిష్య రెడ్డిని వచ్చే నెల 2 నుంచి విజయనగరంలో జరిగే బీసీసీఐ మహిళ అండర్-15 ట్రోఫీకి ఎంపిక చేయడం పట్ల లెజెండ్స్ క్రికెట్ అకాడమి కోచ్ లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఉన్నతంగా రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అభినందిస్తున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40247/