schedule Saturday, July 04, 2026

కీచక టీచర్ సస్పెండ్..!

calendar_today October 26, 2025
person dharshininews
కీచక టీచర్ సస్పెండ్..!
కీచక టీచర్ సస్పెండ్..! - ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ - వెల్లడించిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ టీచర్ రాఘవేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తెలిపారు. టీచర్ రాఘవేందర్ రెడ్డి అదే పాఠశాలకు చెందిన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై జిల్లా విద్యాధికారి రేణుకాదేవి విచారణకు ఆదేశించడంతో ఎంఈఓ వెంకటయ్య గౌడ్ కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో విచారణ చేపట్టారు. kvcs ఈ నివేధికను జిల్లా విద్యాధికారికి పంపించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ రాఘవేందర్ రెడ్డిపై సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. సోమవారం ఉత్తర్వులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39264/