schedule Saturday, July 04, 2026

నైట్ డ్రోన్లపై ఆరా..!

calendar_today October 26, 2025
person dharshininews
నైట్ డ్రోన్లపై ఆరా..!
నైట్ డ్రోన్లపై ఆరా..! - పోలీసుల విస్తృత తనిఖీలు - ఫాంహౌసులు, లాడ్జింగ్లలో పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : రెండు రోజులుగా తాండూరు ప్రాంతంలో చక్కర్లు కొడుతున్న నైట్ డ్రోన్ల వ్యవ హారం తేల్చేందుకు పోలీసు యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఆదివారం తాండూరు రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రాత్రి పెద్దేముల్ మండలంలోని నర్సాపూర్, ఆత్కూర్, రుద్రారం, ఇందూరు, పెద్దేముల్ తాండాలలో డ్రోన్లు తిరగగా.. శనివారం రాత్రి తాండూరు పట్టణంలోని ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి, సాయిపూర్ ప్రాంతాలలో డ్రోన్లు తిరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు రోజుల పాటు రాత్రి వేళల్లోనే డ్రోన్లు తిరగడం కలకలం రేపింది. డోన్ల చక్కర్ల విషయంలో పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం ఆందోళనకు గురిచేసింది. kvcs ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. దీంతో ఆదివారం పోలీసు శాఖ తనిఖీలు చేపట్టింది. రూరల్ సీఐ నగేష్, పోలీసు సిబ్బంది తాండూరు ప్రాంతంలోని ఫాం హౌసులు, లాడ్జింగ్ లలో తనిఖీలు చేశారు. పట్టణంలోని ఎవరైనా కొత్త అనుమానుతులు వచ్చారా..? డ్రోన్ల చక్కర్లకు వాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాలలో దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన పనిలేదని, విచారణతో వివరాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39258/