schedule Thursday, September 03, 2026

సగ్గు బియ్యం సూపర్..!

calendar_today October 17, 2025
person dharshininews
సగ్గు బియ్యం సూపర్..!
సగ్గు బియ్యం సూపర్..! - ఎలా తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలు - మెదడు పనితీరు మెరుగుపరిచే పోషకాలు - మరిన్ని ఉపయోగాలు తెలిస్తే ఎగబడి తింటారు దర్శిని డెస్క్ : సగ్గు బియ్యం అతిముఖ్యమైన ఆహారం కావడంతో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఇందులోని పోషకాల వల్ల శరీరానికి సూపర్ బూస్ట్‌ను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలా తీసుకున్న కూడా ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. సగ్గు బియ్యం గర్భిణీలకు, పిల్లలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఇతర ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. ఇది చర్మాన్ని మెరుగుపరచడానికి ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్‌ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాధిబారిన పడ్డవారు లేదంటే, వ్యాయామం చేసిన తరువాత తీసుకుంటే అద్భుత ఫలితాన్నిస్తుంది. సగ్గు బియ్యం నీటిని బాగా గ్రహిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని పాలు, చక్కెర పోసి పాయ‌సంలా వండుకుని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది. విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సగ్గుబియ్యం దివ్యౌషధంగా పనిచేస్తుంది. విరేచనాల సమయంలో సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. kvcs సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. ఊబ‌కాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు స‌మ‌తాస్థితిలో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక బరువు కూడా తగ్గుతారు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయట పడవచ్చు. అంతేకాదు, సగ్గు బియ్యం ఫైబర్‌కు మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని నివారిస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకు కూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.) https://www.dharshininews.com/39154/