schedule Saturday, July 04, 2026

బీసీ రిజర్వేషన్లపై స్టే..!

calendar_today October 9, 2025
person dharshininews
బీసీ రిజర్వేషన్లపై స్టే..!
బీసీ రిజర్వేషన్లపై స్టే..! - తాత్కాళికంగా నిలిపివేత - ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39047/