schedule Thursday, September 03, 2026

తాటిబెల్లం.. హెల్దీ..!

calendar_today September 18, 2025
person dharshininews
తాటిబెల్లం.. హెల్దీ..!
తాటిబెల్లం.. హెల్దీ..! - చెంచా పోడి చప్పరిస్తే తలనొప్పి మాయం - ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం - పొడిదగ్గు, జలుబుపై రామబాణం - ఇంకా మరెన్నో ఉపయోగాలు దర్శిని డెస్క్ : ప్ర‌కృతి మ‌న‌కు అందిస్తున్న ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో తాటి బెల్లం కూడా ఒక‌టి. దీన్ని మ‌నం ర‌హ‌దారుల ప‌క్క‌న చూడ‌వ‌చ్చు. చాలా మంది తాటిబెల్లాన్ని విక్ర‌యిస్తుంటారు. అయితే తాటి బెల్లంను అది ఉన్న రంగు కార‌ణంగా చాలా మంది ఇష్ట ప‌డ‌రు. కానీ ఇది అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే తాటి బెల్లంను ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు. kvcs ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు చెక్‌ పెడుతుంది. మైగ్రేన్‌ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం (Palm jaggery) పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు. తాటిబెల్లంలో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. శ‌రీరంలోని టాక్సిన్ల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. క్యాన్స‌ర్ కార‌కాల‌తో పోరాడి క్యాన్స‌ర్‌ను నివారించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నోట్‌ : నిపుణుల సూచనల మేరకు మేం మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్యసమస్యలున్నవారు మా సూచనలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38638/