schedule Thursday, September 03, 2026

ఆర్టీసీలో జాబ్స్..!

calendar_today September 17, 2025
person dharshininews
ఆర్టీసీలో జాబ్స్..!
ఆర్టీసీలో జాబ్స్..! - నోటిఫికేషన్ జారీ - పోస్టులు, అర్హతలు ఇవే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాల భర్తికి చర్యలు చేపట్టింది. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. kvcs ఆర్టీసీలో 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబరు 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి వారికి 5 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అయితే 3ఏళ్లు వయో పరిమితి సడలింపు ఉంటుందని బోర్డు తెలిపింది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం www.tgprb.inలో చూడాలని పోలీసు నియామక మండలి తెలిపింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38635/