schedule Saturday, July 04, 2026

నల్ల మిరియాలా.. మజాకా..!

calendar_today September 8, 2025
person dharshininews
నల్ల మిరియాలా.. మజాకా..!
నల్ల మిరియాలా.. మజాకా..! - రోగాలు తగ్గించి.. మెమరీ పెంచుతోంది - మతిమరుపు రాకుండా ప్రయోజనం - గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : మన వంటింట్లో కనిపించే నల్ల మరియాలలోని ఉపయోగాలు తెలిస్తే నల్ల మిరియాలా మజాకా అనాల్సిందే. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, పైపెరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని మందుగా కూడా వాడుతారు. మనం రోజూ తినే ఆహారంలో మిరియాలను చేర్చుకుంటే.. మన శరీరానికి చాలా రక్షణ దొరుకుతుంది. నల్ల మిరియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. kvcs నల్ల మిరియాలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. అవి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. మిరియాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా నివారించడానికి సహాయపడతాయి. మిరియాలలో పైపెరిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మిరియాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరంలోని కణాలను కాపాడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి నల్ల మిరియాలు సహాయపడతాయి. కొద్దిగా వాడితే హై బ్లడ్ షుగర్ తగ్గే అవకాశం ఉంది. మిరియాలు మన జీర్ణ ఎంజైమ్‌ లను ఉత్తేజపరుస్తాయి. మనం తినే భోజనంతో పాటు వీటిని తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. మిరియాల లోని గుణాలు గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు నల్ల మిరియాలను మితంగా వాడితేనే మంచిది. ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు మంట వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఎంత తినాలనేది డాక్టర్‌ ను అడిగి తెలుసుకోవడం మంచిది. ఎలా తీసుకోవాలి? ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోవచ్చు. పాలు లేదా నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు మిరియాల రసాన్ని తీసుకోవడం మంచిది. ముఖ్య గమనిక: నల్ల మిరియాలు చాలా మందికి సురక్షితమైనవి అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణకోశ అసౌకర్యం కలగవచ్చు. మీకు అలెర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం https://www.dharshininews.com/38426/