schedule Thursday, September 03, 2026

ఆరోగ్యానికి ఒక్కో'టీ'..!!

calendar_today September 1, 2025
person dharshininews
ఆరోగ్యానికి ఒక్కో'టీ'..!!
ఆరోగ్యానికి ఒక్కో'టీ'..!! - ఈ స్పెషల్ చాయ్‌లతో ఉపయోగాలు - నిద్రలేమి, గ్యాస్‌ సమస్యలకు చెక్ - పొట్టలను కరిగించే శక్తి దర్శిని డెస్క్: చాలా మందికి టీ తాగే అలవాటు ఉండే ఉంటుంది. జీవీతంలో ఒక్క'టీ'గా మారిపోయిన దీని వల్ల ఎంతో మంది ఉపశమనం పొందుతారు. ఉదయం లేవగానే తాగితే ఓ హాయి, పని ఒత్తిడితో తాగితే మరో హాయి. ఇప్పుడు అయితే టీలలో రకరకాలు వచ్చాయి. రోజు రోజుకు ఈ రకరకాల టీకి చాలా మంది అలవాటు పడిపోతున్నారు. లేమన్ టీ, బ్లాక్ టీ, పుదీనా టీ, అల్లం టీ, లవంగం టీ వంటి అనేక రకాలుగా తీసుకుంటున్నారు. ఎప్పటి మాదిరిగానే టీ డికాషిన్‌తో కాకుండా ఈ ప్రత్యేకమైన పదార్ధాలతో చేసిన టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ స్పెషల్ టీ ఏంటో.. ఎలా తయారు చేయాలో ఈరోజు ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం.. kvcs లవంగం టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో లవంగాలు మంచి ఎంపిక. లవంగాలలోని పదార్ధం జీర్ణ ఎంజైమ్‌ల విడుదలలో సహాయపడుతుంది. ఇందులోని యూజినాల్ జీర్ణాశయంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి మరిగించాలి. కావాలంటే అల్లం వేసుకోవచ్చు. పుదీనా టీ పుదీనా ఆకులు అజీర్ణానికి చక్కని పరిష్కారం. ఈ ఆకులతో మెడిసిన్‌ కూడా తయారు చేస్తారు. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీ అజీర్ణం, నోటి దుర్వాసన, మానసిక అలసటను నివారించడానికి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఈ టీ బలేగా ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి కాసేపు మూత పెట్టాలి. కావాలంటే పుదీనా ఆకుల పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇలా పుదీనా టీ తయారు చేసుకోవచ్చు. జీలకర్ర టీ జీలకర్ర జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అపానవాయువు, గ్యాస్, అజీర్తిని తొలగించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇది ఆందోళనను తొలగించి మంచి నిద్రను కలిగించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్రను నీళ్లతో మరిగించి వడకట్టడం వల్ల కడుపు సమస్యలకు మేలు జరుగుతుంది. ఇదికూడ చదవండి.... https://www.dharshininews.com/38286/