schedule Thursday, September 03, 2026

ఐదురోజులు వానలే..!

calendar_today August 26, 2025
person dharshininews
ఐదురోజులు వానలే..!
ఐదురోజులు వానలే..! - ఏయే రోజు ఎక్కడెక్కడ కురుస్తాయంటే - డైలీ రిపోర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : బంగాళఖాతంలో అల్పపీడనం వల్ల రాగల ఐదురోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా తీరాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. నైరుతి వైపునకు వంగి ఉందని.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాబోయే రెండురోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. kvcs ఈ క్రమంలో మంగళవారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, భువనగిరి, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు తెలిపింది. బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్‌, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38157/