schedule Friday, September 04, 2026

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!

calendar_today August 18, 2025
person dharshininews
సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!
సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..! - వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి - డీఎంహెచ్ఎ, జిల్లా సూపరిండెంట్ లకు సూచన - ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్) డా. లలితాదేవి, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిడెంట్ డా.సునీతలతో ఫోన్లో మాట్లాడారు. kvcs తాండూరు ప్రాంతంలో సీజనల్ వ్యాధుల గురించి ఆరా తీశారు. తాండూరులో డెంగీ, మలేరియా, అతిసార కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే తాండూరులో డెంగ్యీ, మలేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను మెరుగు పరచాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రిలో మందుల కొరత ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇందుకు వైద్యాధికారి, సూపరిండెంట్ లు సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37886/