schedule Friday, September 04, 2026

కొత్త రేషన్ కార్డులు రెడీ..!

calendar_today July 9, 2025
person dharshininews
కొత్త రేషన్ కార్డులు రెడీ..!
కొత్త రేషన్ కార్డులు రెడీ..! - మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి - ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చూసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈనెల 14వ తేదిన సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంచనంగా ప్రారంభించనున్నారు. తరువాత అన్ని జిల్లాలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ పథకాన్ని ఈ సంవత్సరం జనవరి 26నే ప్రభుత్వం ప్రారంభించింది. కానీ.. అనేక కారణాల వల్ల.. కొత్త రేషన్ కార్డులు ఇంకా పేదలకు చేరలేదు. ఐతే.. ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుంటే కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారు, పేర్లు యాడ్ చేసుకున్న లబ్దిదారులు తమ పేర్లు ఉన్నాయో లేవో అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయో లేవో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కింద సూచించిన విధంగా ప్రయత్నించండి.. - తెలంగాణ అధికారిక https://epds.telangana.gov.in/FoodSecurityAct/ పోర్టల్‌ని సందర్శించండి. - హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న ఫస్ట్ ఆప్షన్​ 'FSC Search' పైన క్లిక్ చేయండి. - ఇప్పుడు Ration Cards Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. - దానిపై క్లిక్ చేస్తే.. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్​ కనిపిస్తాయి. అందులో FSC Application Search ఆప్షన్ మీద క్లిక్ చేయండి. - ఇప్పుడు మీ జిల్లా, మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్​ చేస్తే స్టేటస్​ కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న మీ రేషన్​ కార్డు వివరాలను చూసుకోవాలంటే.. FSC Search మీద క్లిక్​ చేసి, లోనికి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు కాలమ్​లో మీ కార్డుు నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే సరిపోతుంది. మీ కార్డులోని సభ్యుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36700/