డేరింగ్.. లేడీ.. బీట్ ఆఫీసర్..!
July 7, 2025
dharshininews
డేరింగ్.. లేడీ.. బీట్ ఆఫీసర్..!
- 18 అడుగుల పామును ఈజీగా పట్టేసింది
- వైరల్ అయిన స్నేక్ క్యాచింగ్ వీడియో
దర్శిని డెస్క్ : విధి నిర్వహణలో ఓ లేడీ బీట్ ఆఫీసర్ డేరింగ్‌ను ప్రదర్శించింది. ఎదురుగా ఉన్న 18 అడుగుల కింగ్ కోబ్రా పామును ఎంతో చాకచక్యంగా బందించింది.
సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. అలాంటిది అందరిని భయపెట్టే కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్ చాలా ఈజీగా పట్టేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
తిరువనంతపురంలోని పెప్పరలో ఓ నివాస ప్రాంతాల నడుమ ఉన్న కాలువలో స్థానికులు కోబ్రాను గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి దాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను చాలా ప్రశాంతంగా ఓ కట్టె సాయంతో పట్టుకొని సంచిలో బంధించారు. స్థానికులు 18 అడుగుల కింగ్ కోబ్రాను లేడీ ఆఫీసర్ రోషిణి పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. గతంలోనూ రోషిణి ఇలాగే 500లకు పైగా పాములను బంధించినట్లు తెలిసింది.
వీడియో కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి...
https://x.com/Autokabeer/status/1942099632223576409?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1942099632223576409%7Ctwgr%5E12dbcf513b76b5a94a37288e2010a1340ef26fd9%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-3424823294284146306.ampproject.net%2F2505300108000%2Fframe.html
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/36681/