schedule Tuesday, September 08, 2026

మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..!

calendar_today July 3, 2025
person dharshininews
మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..!
మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..! - 20 వాహనాల సీజ్, యజమానులపై కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా వాహానాలు నడిపిస్తున్న మైనర్ల డ్రైవింగ్‌పై తాండూరు పట్టణ పోలీసులు కొరడా జులిపించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మైనర్ డ్రైవింగ్ పై పట్టణంలోని జూనియర్ కాలేజీలు, స్కూళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిస్తున్న మైనర్లను గుర్తించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 20 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. మైనర్లకు వాహనాలు అందించిన యజమానులపై ఎంవీ యాక్టు కింద కేసులు మనోదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు అందిస్తే చర్యలు తప్పవన్నారు. వాహనాలతో మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థలపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36572/