schedule Monday, September 07, 2026

గంజాయితో డాక్టర్..!

calendar_today June 18, 2025
person dharshininews
గంజాయితో డాక్టర్..!
గంజాయితో డాక్టర్..! - 65 గ్రాములతో దొరికిన వైనం - వికారాబాద్‌లో కలకలం వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఓ వైద్యుడు గంజాయితో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన బుధవారం వికారాబాద్‌లో కలకలం రేపింది. డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌ అనే వ్యక్తి వికారాబాద్‌లో అతిర అనే ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే ఈ డాక్టర్‌పై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో డాక్టర్ వద్ద పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 65 గ్రాముల గంజాయి లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36217/