schedule Friday, September 04, 2026

బెల్లం, శనగలతో మస్త్ బెనిఫిట్స్‌..!

calendar_today June 10, 2025
person dharshininews
బెల్లం, శనగలతో మస్త్ బెనిఫిట్స్‌..!
బెల్లం, శనగలతో మస్త్ బెనిఫిట్స్‌..! - జ్ఞాపక శక్తిని పెంచే ఔషధగుణాలు - ఎముకలు, దంతాలకు బలం దర్శిని డెస్క్ : బెల్లం, శనగలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నోరకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. వీటి ప్రయోజనాలను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలామంది ఎసిడిటి సమస్యతో భాదపడుతున్నారు. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను యాక్టివేట్ చేస్తాయి. రోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. దృఢమైన దంతాల కోసం: శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. రక్తం రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే శెనగలు, బెల్లం కలిపి తినవచ్చు. ఈ రెండూ ఐరన్‌ పుష్కలంగా ఉన్న కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెంచి శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో సహాయపడతాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36066/