schedule Thursday, September 03, 2026

మహిళలకు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్..!

calendar_today May 25, 2025
person dharshininews
మహిళలకు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్..!
మహిళలకు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్..! - కేంద్ర ప్రభుత్వ పథకంలో అందజేత - ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం - అర్హతలు ఉంటే నేరుగా ఇంటికే..  దర్శిని డెస్క్ : కేంద్రప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తోంది. ఈ పథకం పేరే ఉజ్వల యోజన పథకం. పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లు అందించడం కోసం 2016లో ఈ పథకంను దేశ ప్రధాని మోడి ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 5 కోట్లకు పైగా మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తుంది. అర్హతలు ఇవే... రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పురుషులకు ఈ పథకానికి అర్హత లేదు. ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు. ఆధార్ కార్డు ఉండాలి. బ్యాంక్ ఖాతా ఉండాలి. మొబైల్ నంబర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. దరఖాస్తు చేసే మహిళ కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. SECC-2011 డేటాబేస్‌లో ఉన్న బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు. ఎస్సీ/ఎస్టీ, అతి వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), అటవీ నివాసితులు, నదీ ద్వీపాలలో నివసించే వారు, పీఎంఏవై (గ్రామీణ), అంత్యోదయ అన్న యోజన (ఆయై), టీ తోటల కార్మికులు మాజీ కార్మికులు వంటి వర్గాలకు చెందిన మహిళలు కూడా అర్హులు. దరఖాస్తు చేసేవారికి ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తు చేసుకోండి ఇలా.. ఈ పథకం కోసం మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అయితే మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన పత్రాలతో సమర్పించవచ్చు. అదేవిధంగా అన్‌లైన్ ద్వారా అయితే www.pmuy.gov.in లో లాగిన్ అయి PMUY కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ కనిపించే “న్యూ ఉజ్వల కనెక్షన్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 3 గ్యాస్ ఏజెన్సీల (ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్) పేర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో ఎంచుకోండి. ఆ తర్వాత మీరు మరో కొత్త పేజీలోకి వెళతారు. ఆ పేజీలో మీ పేరు, మీ సమీపంలో గ్యాస్ ఏజెన్సీ పేరు, మొబైల్ నంబర్, పిన్ కోడ్ వంటి సమాచారాన్ని నింపండి. తరువాత అక్కడ అడిగే పత్రాల ఫోటో కాపీలను అప్‌లోడ్ చేయండి. చివరగా, దరఖాస్తు ఫారంను సమర్పించండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే, మీ దరఖాస్తు ఫారం విజయవంతంగా పూర్తయినట్లు మీకు కనిపిస్తుంది. మీ దరఖాస్తు ఆమోదం పొందితే, సబ్సిడీ సిలిండర్ నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35678/