schedule Thursday, September 03, 2026

అల్లం టీ.. ఇట్స్ డేంజర్..!

calendar_today April 18, 2025
person dharshininews
అల్లం టీ.. ఇట్స్ డేంజర్..!
అల్లం టీ.. ఇట్స్ డేంజర్..! - వేసవిలో తాగడం మానేయండి - అలవాటు వల్ల అనారోగ్య సమస్యలు - ఏయేం వస్తాయో తెలిస్తే షాకే.. దర్శిని డెస్క్ : అల్లం టీ..నీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు వేసవిలో మాత్రం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో అల్లం టీ తాగితే అనారోగ్య సమస్యలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు ఇబ్బందులు వస్తాయని, వేసవిలో అల్లం టీ తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు. అయినా మానకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మీరే తెలుసుకోండి.. వేసవిలో ఉష్ణోగ్రత ఇప్పటికే అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింత పెరిగి జీర్ణవ్యవస్థ తాళలేక ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం అవసరం. అందుకే ఈ కాలంలో అల్లం టీ వాడకాన్ని తగ్గించడం మంచిది. అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిమాణంలో తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగవచ్చు. వేసవిలో శరీరం ఎంతో త్వరగా నీటిని కోల్పోతుంది. అలాంటి సమయంలో వేడి గుణం కలిగిన అల్లం టీ తాగడం వల్ల నీటి శాతం మరింత తగ్గిపోవచ్చు. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి, తలనొప్పి, అలసట, దాహం అధికంగా ఉండటం, ఒళ్లు బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎక్కువగా బయట తిరిగే వారు లేదా క్రమంగా నీరు తాగని వారు ఈ సమస్యకు లోనవుతారు. అల్లం టీ వల్ల రక్తం పలుచబడే అవకాశం కూడా ఉంది. శీతాకాలంలో ఇది ఉపశమనం కలిగించినా వేసవిలో ఇది హానికరం కావచ్చు. ముఖ్యంగా రక్తాన్ని పలుచబెట్టే మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్లం టీ కారణంగా రక్తం మరింత పలుచగా మారి.. చిన్న గాయానికి కూడా ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశముంటుంది. ఇది శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపేలా పని చేస్తుంది. వేసవిలో తరచూ అల్లం టీ తాగడం వల్ల కొందరికి విరేచనాలు, పేగుల సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, స్కిన్ అలర్జీలు వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా రాత్రివేళలలో అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాక అలర్జీకి గురయ్యే వారు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా వేసవిలో అల్లం టీ తాగడాన్ని తగ్గించాలి. శరీరానికి తగిన ఉష్ణోగ్రతను నిలుపుకోవాలంటే వేడి స్వభావం ఉన్న పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34922/