schedule Saturday, July 04, 2026

టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ

calendar_today April 11, 2025
person dharshininews
టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ
టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ - షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కారు - దరఖాస్తుల గడువు, పరీక్షలు వివరాలు ఇలా హైదరాబాద్, దర్శిని ప్రతినధి : తెలంగాణలో ఉపాధ్యాయుల కొలువులకు సంబంధించిన టీజీ టెట్(తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పరీక్షలు, దరఖాస్తులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ నుంచే అంటే శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. ఇక టెట్ ఆన్‌లైన్‌ ఆధారిత కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 2025 జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన వెలువరించింది. టెట్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన మేరకు ఈ ఏడాదికి తొలి విడత నిర్వహించవల్సిన టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసి రేవంత్‌ ప్రభుత్వం మాట మీద నిలబడింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34721/