schedule Thursday, September 03, 2026

ఒక్క క్లిక్‌ చాలు..!

calendar_today April 10, 2025
person dharshininews
ఒక్క క్లిక్‌ చాలు..!
ఒక్క క్లిక్‌ చాలు..! - రేషన్‌ కార్డు స్టేటస్ తెలుసుకొండి - కొత్త పేర్ల వివరాలు తెలుసుకోవచ్చు దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల లబ్దిదారుల్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలన కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు రాని లబ్దిదారులతో పాటు కొత్తగా పెళ్లైన జంటలు, ఇదిరవరకే కార్డులు ఉన్న వారు వారి పిల్లలను కార్డులో పేర్లు నమోదు చేయించుకునేందుకు దరఖాస్తులు సమర్పించుకున్నారు. ఇప్పటికి నెలలు గడుస్తున్నా లబ్దిదారులకు సరైన వివరాలు లభించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారం దొరికింది. కంప్యూటర్లో అయినా, చేతిలో ఉన్న మోబైల్‌లో అయినా ఒక్క క్లిక్ చేస్తే వివరాలను తెలుసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్​లో తెలంగాణ ఫుడ్​ సెక్యూరిటీ కార్డ్స్​ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ స్క్రీన్​ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనిపిస్తాయి. అందులో FSC Application Search మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ-సేవా అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా జిల్లా సెలెక్ట్ చేసుకుని, Mee Seva No బాక్స్​పై క్లిక్​ చేయాలి. ఆ అప్లికేషన్ నెంబర్ బాక్సులో దరఖాస్తు సమయంలో ఇచ్చిన మీ సేవ రసీదులోని అప్లికేషన్​ నెంబర్​ను ఎంటర్​ చేసి Search బటన్ క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్‌కు సంబంధించిన స్టేటస్​ వివరాలు కింద కనిపిస్తాయి. Apporved అని ఉంటే మీకు రేషన్​ కార్డు వచ్చినట్లే. ఒకవేళ Pending అని ఉంటి మరికొంచెం సమయం పడుతుంది. ఒకవేళ ఎవరిదైన రేషన్ కార్డు రిజెక్ట్ అయితే దాని స్టేటస్ తెలుసుకునేందుకు Status of Rejected Ration Card మీద క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. కొత్త పేర్ల నమోదును వివరాలు ఇలా తెలుసుకోండి. ముందుగా తెలంగాణ ఫుడ్​ సెక్యూరిటీ కార్డ్స్​ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ స్క్రీన్​ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card Search ఆఫ్షన్లు కనిపిస్తాయి. అందులో FSC Search మీద క్లిక్ చేయాలి. ఆ పేజీలో FSC Ref No లేదా రేషన్​ కార్డ్​ లేదా పాత రేషన్​ కార్డ్​ నెంబర్​ ఎంటర్​ చేసి Search పై క్లిక్​ చేయాలి. అప్పుడు స్క్రీన్​ మీద మీ రేషన్​ కార్డుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని బట్టి అందులో పేర్లు యాడ్​ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34685/