schedule Saturday, September 05, 2026

సమ్మర్‌లో 'ఐ' కేర్..!

calendar_today April 9, 2025
person dharshininews
సమ్మర్‌లో 'ఐ' కేర్..!
సమ్మర్‌లో 'ఐ' కేర్..! - వేసవిలో మీ కళ్లు జాగ్రత్త - కళ్ల కలకతో పాటు అనేక సమస్యలు - ఈ చర్యలు పాటిస్తే సేఫ్‌ దర్శిని డెస్క్ : వేసవి వేడి మనషుల శరీరాలనే కాదు ఇతర అవయాలను కూడా వేధిస్తుంది. శరీరంలో నయనం ప్రధానం అంటారు. వేసవి కాలంలో కంటి సమస్యలు కూడా వేధిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండ నుంచి మన కళ్లను కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తే మన కళ్లు సేఫ్‌గా ఉంటాయని పేర్కొంటున్నారు. వైద్యులు చెప్పిన సలహాలు కొన్ని మీకోసం... వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రత వల్ల సూర్యుడి తీవ్రత నుంచి కంటిని రక్షించుకోవాలి. అందుకోసం యూవీ కిరణాలను తగ్గించే మంచి గాగుల్స్‌ వాడడం మంచిది. సూర్యుడిని కళ్లతో నేరుగా చూడవద్దు. అలా చూస్తే కళ్లు దెబ్బతింటాయి. వేసవిలో ఎక్కువగా కళ్ల కలక వస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరుల కర్చీఫ్‌లను వాడవద్దు. ఈ సమయాల్లో కరచాలనాలు వద్దు. చేతితో కళ్లను ముట్టుకోవద్దు. కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేత్రవైద్యులను సంప్రదించాలి. దుమ్ము, ధూళితో వేసవిలో కళ్లు ఎరుపురంగులోకి మారుతాయి. కంటి రెప్పల కింద కురుపులు వస్తాయి. కళ్లపై దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాలి. కళ్లను రుద్దడం మానేయాలి. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా కళ్లను నలపడం కనిపిస్తుంది. కంటిలో నీటిశాతం తగ్గి, డ్రైనెస్‌ పెరగడం వల్ల చిన్నారులు ఎక్కువగా రుద్దుతుంటారు. దీనికి అలర్జీ లేదా స్క్రీన్‌ను ఎక్కువగా చూడడం అనే కారణాలు ఉంటాయి. కంటి వైద్యుడి వద్దకు వెళ్తే కారణం నిర్ధారిస్తారు. మోతిబిందు ఆపరేషన్‌ అయిన వారికి కళ్లలో ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది. గ్రామాల్లో కొన్నిరకాల మొక్కలు వేసవిలో పుప్పొడిని వెదజల్లుతాయి. దీంతో పంట పొలాల్లో పనిచేసే రైతుల కళ్లలో దురద వస్తుంది. ఎండలో ఎక్కువగా ఉండొద్దు. అప్పుడప్పుడు చల్లని నీటితో ముఖం కడుక్కుంటే మంచిది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34623/