schedule Saturday, September 05, 2026

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

calendar_today March 13, 2025
person dharshininews
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం - మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ - బాధితురాలి కుటుంబానికి ఎల్వోసీ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. 25వ వార్డుకు చెందిన జెట్టూరు లక్ష్మీ అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ను ప్రభుత్వం నుంచి సాయం ఇప్పించాలని కోరారు. ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేయించారు. దీంతో ప్రభుత్వం బాధిత కుటుంబానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ప్రభాకర్ గౌడ్ కుటుంబానికి ఎల్వోసీని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహాకారంతో కుటుంబానికి ఆర్థిక సాయం అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా నిలుస్తుందని. ఈ పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33957/