schedule Thursday, September 03, 2026

చెరుకు రసమా.. మజాకా..!

calendar_today March 4, 2025
person dharshininews
చెరుకు రసమా.. మజాకా..!
చెరుకు రసమా.. మజాకా..! - తాగేందుకు కూడా నియమాలు - ఏవయస్సు వారు ఎంత తాగాలంటే..? దర్శిని డెస్క్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు సేవించేందుకు మొగ్గుచూపుతారు. వేసవిలో శీతల పానీయాలు అనగానే ముందుగా చెరుకు రసం గుర్తుకొస్తోంది. చాలా మంది చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. చెరకు రసం తాగిన తర్వాత మజాగా అనిపిస్తుంది. కానీ ఇలా తరచూ చెరకు రసం తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెరకు రసం శరీరానికి అంత ఆరోగ్యకరమైనది కాదని ICMR కూడా చెబుతోంది. అయితే చెరుకు రసం ఏ వయస్సు వారు.. ఎంత సేవించాలనే దానిపై మాత్రం సూచనలు చేసింది. 100 మి.లీ చెరకు రసంలో దాదాపు 13-15 గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనలో తేలింది. పెద్దలు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను, 7-10 సంవత్సరాల వయస్సు గల టీనేజర్లు 24 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఏదీ అతిగా తీసుకోవడం మంచిది కాదు. చెరకు రసం తాగడం వల్ల కొంత నష్టం ఉన్నప్పటికీ, దానిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చెరకు రసంలో పోషక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్‌, పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో చెరకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అదనంగా, చెరకు రసంలోని ఖనిజాలు దంతాలు, ఎముకలను బలపరుస్తాయి. చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. దంతాలు, ఎముకలను బలపరుస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రోక్ అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33713/