schedule Thursday, September 03, 2026

తీన్మార్ మల్లన్న ఔట్..!

calendar_today March 1, 2025
person dharshininews
తీన్మార్ మల్లన్న ఔట్..!
తీన్మార్ మల్లన్న ఔట్..! - కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ - ప్రకటించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఔట్ అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్‌ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 12 వ తేది లోపు వివరణ ఇవ్వాలని కోరినా.. మల్లన్న నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు అని ఆయన పేర్కొన్నారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. అందుకే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33588/