schedule Thursday, September 03, 2026

అల్లంతో అద్బుత లాభాలు..!

calendar_today February 15, 2025
person dharshininews
అల్లంతో అద్బుత లాభాలు..!
అల్లంతో అద్బుత లాభాలు..! - రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు - బాడీపి క్లీన్‌ చేసే మెడిసిన్స్‌ దర్శిని డెస్క్ : అల్లం ఆహారం రుచిని, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అల్లం ఒక అద్భుతమైన మూలిక అందరూ దీనిని ఒక మసాలా రూపంలో చూస్తారు. దీనిని ఒక సుగంధంగా ద్రవ్యం గా చూస్తారు. అందుకే ఆహారం లో వాడేందుకు ఇష్టపడతారు. రోజూ అల్లం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటి ఆక్సిడెంట్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ వంటి సమస్యలకుచక్కని ఔషదం అల్లం రసం. వాతావరణం లో వచ్చే మార్పులు ఇతర అనారోగ్యాలు సోకకుండా కప్పడే గుణం అల్లంలో ఉందని అంటారు నిపుణులు. అల్లం రసం తాగడం వల్ల శరీరంలో ఉన్న పంచేంద్రియాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తింటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అల్లం తింటే ఆహారం సులభంగా జీర్ణమయ్యి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి అల్లం సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. అల్లం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగడానికి ఉత్తమమైన డిటాక్స్ పానీయంగా ఉంటుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తింటే వ్యాధులతో పోరాడటానికి శరీరం బలంగా మారుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు కూడా అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్లం చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అల్లం జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును బలమైనదిగా, ఒత్తుగా ఉంచడంలో సహాయపడుతుంది. అల్లంలోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33044/