schedule Friday, September 04, 2026

డా.జయప్రసాద్‌కు మళ్లీ ఉత్తమ అవార్డు..!

calendar_today February 9, 2025
person dharshininews
డా.జయప్రసాద్‌కు మళ్లీ ఉత్తమ అవార్డు..!
డా.జయప్రసాద్‌కు మళ్లీ ఉత్తమ అవార్డు..! - రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందజేత - తాండూరు వైద్యునికి దక్కిన గౌరవం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్(జనరల్ సర్జన్)కు మరోసారి ఉత్తమ అవార్డు దక్కింది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడిగా అవార్డును అందుకున్నారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ డా.జయప్రసాద్ కు ఉత్తమ అవార్డును అందజేశారు. గత నెల జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా డా. జయప్రసాద్ జిల్లా ఉత్తమ వైద్యుడుగా అవార్డును పొందారు. తాజాగా నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ఉత్తమ అవార్డును దక్కించుకున్నారు. తాండూరు వైద్యుడికి దక్కిన గౌరవానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డా.జయప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. డా.జయప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమ అవార్డులు తనపై గౌరవాన్ని, బాధ్యతను పెంచాయన్నారు. ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32960/