schedule Thursday, September 03, 2026

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్...!

calendar_today February 7, 2025
person dharshininews
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్...!
కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్...! - మీసేవలో దరఖాస్తులకు అవకాశం - మార్పులు, చేర్పులకు చాన్స్ - మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. లబ్ధిదారుల నుంచి రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాలశాఖ కోరింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32929/