schedule Thursday, September 03, 2026

ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!

calendar_today November 5, 2024
person dharshininews
ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!
ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..! - రేపటి నుంచి పరీక్ష చెల్లింపుకు అవకాశం - అపరాద రుసుం గడువు ఎప్పటి వరకు అంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. నవంబర్‌ 6 నుంచి 26 వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.1000 అపరాద రుసుంతో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు చెల్లించవచ్చు. ఫస్టియర్‌, సెకెండియర్‌ జనరల్‌ విద్యార్థులు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు తెలిపింది. సెకెండియర్‌ జనరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.520, సెకెండియర్‌ జనరల్‌ సైన్స్‌ విద్యార్థులు రూ.750 చెల్లించాలని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు వివరాలివే.. * ఫస్టియర్‌ జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.520/- * ఫస్టియర్‌ ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.750 * సెకండియర్‌ జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.520 * సెకండియర్‌ జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.750 * సెకండియర్‌ ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు (థియరీ+ప్రాక్టికల్స్‌) రూ.750గా నిర్ణయించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30376/