schedule Saturday, September 05, 2026

ఈనెల సదరం తేదిలివే..!

calendar_today October 9, 2024
person dharshininews
ఈనెల సదరం తేదిలివే..!
ఈనెల సదరం తేదిలివే..! - షెడ్యూల్‌ ప్రకటించిన అధికారులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని సర్కారు దవాఖానలో నిర్వహించే సదరం క్యాంపుల తేదీలను అధికారులు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో అధికారులు షెడ్యూల్‌ ప్రకటించారు. రేపు గురువారం తాండూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో శారీరక అంగవైకల్యం గల (OH) 60 మందికి, 14 న బుద్ది మాంద్యం గల (MR &MI) 50 మందికి, 24 న శారీరక అంగవైకల్యం గల (OH) 60 మందికి, 28 న బుద్ది మాంద్యం గల (MR &MI) 50 మందికి, 30 న వినికిడి లోపం గల (HI) 60 మందికి క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రేపు గురువారం శారీరక అంగవైకల్యం గల (OH) 60 మందికి, 18న చూపులేని (VI) 50 మందికి, 24 న బుద్ది మాంద్యం గల (MR &MI) 50 మందికి, 29 న శారీరక అంగవైకల్యం గల (OH) 60 మందికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇదివరకు సదరం సర్టిఫికెట్ పొంది సర్టి ఫికేట్ కాల పరిమితి అయి పోయిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసు కొన్న వారితో సహా 500 మందికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29630/