schedule Saturday, September 05, 2026

వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..!

calendar_today September 9, 2024
person dharshininews
వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..!
వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..! - శరీరంలోని కొలస్ట్రాల్ పరార్ - రక్తనాళాల విశ్రాంతికి మూలకాలు - ఆరోగ్యానికి ఉపయోగాలెన్నో దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి లభించే ఫలాలతో మావన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎండు ద్రాక్షలో శరీరంలోని వ్యాధులకు చెక్‌ పెట్టే మూలకాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో నల్ల ఎండు ద్రాక్ష గురించి తెలుసుకోవాల్సిందే. ఎండు ద్రాక్షలో ఐరన్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. ఇందులోని గుణాలు శరీరానికి అనేక రకాల పోషకాలు అందిస్తాయి. ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కె కూడా అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఎండ్రు ద్రాక్ష తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా కళ్లు మసకబారడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రతి రోజు ఈ ద్రాక్షను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా నియంత్రణలో ఉంటుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఉండే గుణాలు LDL కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రక్తపోటు కూడా తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో క్యాల్షియం, బోరాన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా తయారు చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు మేలు చేస్తుంది. మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది గుండె సమస్యలను తగ్గించేందుకు, రక్తనాళాలను విశ్రాంతికి కీలక పాత్ర పోషిస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని కారణంగా అనేక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28363/