schedule Thursday, September 03, 2026

రైన్‌ ఎఫెక్ట్..!

calendar_today September 1, 2024
person dharshininews
రైన్‌ ఎఫెక్ట్..!
రైన్‌ ఎఫెక్ట్..! - రేపు విద్యాసంస్థలకు సెలవు - ప్రకటించిన తెలంగాణ సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సర్కారు విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. రేపు సోమవారం తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికి ఇతర శాఖల అధికారులకు ఎలాంటి సెలవు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28675/