schedule Thursday, September 03, 2026

శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..!

calendar_today August 30, 2024
person dharshininews
శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..!
శనగపప్పులో బొలెడు విటమిన్స్‌..! - షుగర్‌ బాధితులకు అద్భుత వరం - గుండె, ఎముకలకు ఆరోగ్యం - మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : శనగలులో ఉండే బొలెడు విటమిన్స్ మానవ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. శనగలు తింటే గుండె, ఎముకల ఆరోగ్యంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. శనగలలో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, క్యాల్షియం, ఐరన్ వంటివి కూడా శనగల్లో పుష్కలంగా లభిస్తాయి. శనగ పప్పు తినడం వల్ల జీవక్రియ మెరుగు పడి రోజంతా శక్తిని అందిస్తుంది. శనగపప్పు రుచితో పాటు నాణ్యత కూడా చాలా ఎక్కువ. శనగపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లైనా శనగపప్పు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శనగపప్పు తింటే కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకుందాం.. జీర్ణక్రియ ఆరోగ్యం శనగపప్పు తీసుకోవడం వల్ల అందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో శరీరంలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు నియంత్రణ శనగపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో తీసుకునే డైట్‌లో భాగంగా శనగపప్పును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఎముకల ఆరోగ్యం శనగపప్పులో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి. గుండె ఆరోగ్యం శనగపప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. షుగర్ అదుపు శనగపప్పులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం కూడా సులభంగా తగ్గుతుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28625/